Aarogyasri Digital Cards | మీరు ఈ కార్డు కలిగి ఉంటే, మీరు 5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య సంరక్షణ పొందుతారు. ఈరోజే దరఖాస్తు చేసుకోండి

Aarogyasri Digital Cards: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్..రూ.5 లక్షల వరకు భీమా..కొత్త డిజిటల్ కార్డులు కూడా..

Aarogyasri Digital Cards: తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. త్వరలోనే కొత్త డిజిటల్ ఆరోగ్యశ్రీ కార్డులను జారీ చేయాలని నిర్ణయించింది.

అంతేకాదు ఆరోగ్య శ్రీ భీమా పథకం ద్వారా ఇస్తున్న రూ.2 లక్షల భీమా కవరేజిని రూ.5 లక్షలకు పెంచాలని నిర్ణయించింది. దీనితో కొత్త డిజిటల్ కార్డులను లబ్ధిదారులందరికీ ఇవ్వాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

మా వాట్సాప్ గ్రూప్ లో చేరడానికి Click Here 
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి Click Here

ఇప్పటివరకు లబ్ధిదారులను గుర్తించడానికి బయోమెట్రిక్ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. ఇకపై ఫేషియల్ రికాగ్నినైజేషన్ సిస్టంను వాడనున్నారు. దీనికోసం అవసరమైన సాఫ్ట్ వేర్ ను అభివృద్ధి చేసే పనిలో పడ్డారు.

ఆధార్ వెరిఫికేషన్ ద్వారా లబ్ధిదారులు, వారి చిరునామాను ద్రువీకరించనున్నారు. ఆ తరువాత వెరిఫీడ్ డిజిటల్ కార్డులను జారీ చేయనున్నారు.

దీనికి సంబంధించి రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో డిజిటల్ కార్డులకు సంబంధించి కీలక సూచనలు చేశారు.

రానున్న వారం రోజుల్లోనే ఆరోగ్య శ్రీ డిజిటల్ కార్డులను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి హరీష్ రావు ఆదేశించారు.

ఇక ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ సేవలపై ఆడిట్ నిర్వహించేందుకు నిమ్స్ కు చెందిన డాక్టర్ల బృందాన్ని నియమించారు. ఈ బృందం వారం రోజుల్లోనే ఈ ప్రక్రియని ముగించనుంది.

అలాగే కాకతీయ మెడికల్ కాలేజీకి అనుబంధంగా కొనసాగుతున్న ఎంజిఎం ఆసుపత్రిలో ఉచిత కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు చేయడంతో పాటు వినికిడి లోపం వున్న పిల్లలకు పునరావాసం కల్పించాలని నిర్ణయించారు.

ఇది కూడా చదవండి : 

ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

మా వాట్సాప్ గ్రూప్ లో చేరడానికి Click Here 
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి Click Here