IAF Agniveer Jobs 2023: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నివీర్‌ ఉద్యోగాలు.. అర్హత, అప్లికేషన్ ప్రాసెస్ వివరాలు

IAF Agniveer Jobs 2023: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అగ్నిపథ్ స్కీమ్ కింద అగ్నివీర్‌ వాయు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ ప్రాసెస్ జులై 27న ప్రారంభమవుతుంది.

ఇటీవల డిఫెన్స్ రంగంలో భారీగా రిక్రూట్‌మెంట్స్ జరుగుతున్నాయి. ఇండియన్ ఆర్మీతో పాటు ఇతర రక్షణ దళాల్లో డిపార్ట్‌మెంట్ పోస్టుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో తాజాగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అగ్నిపథ్ స్కీమ్ కింద అగ్నివీర్‌ వాయు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ ప్రాసెస్ జులై 27న ప్రారంభమవుతుంది. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ agnipathvayu.cdac.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అర్హత ఏంటి, అప్లికేషన్ ఎలా సమర్పించాలి వంటి వివరాలు తెలుసుకోండి.

IAF Agniveer Jobs 2023 అర్హత ప్రమాణాలు

సైన్స్ సబ్జెక్ట్స్ అభ్యర్థులు ఇంటర్ లేదా అందుకు సమానమైన ఎగ్జామ్‌లో కనీసం 50 శాతం మార్కులతో పాసై ఉండాలి. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ తప్పనిసరి సబ్జెక్ట్‌లుగా ఉండాలి. ఇంగ్లీష్‌లో 50శాతం స్కోర్ తప్పనిసరి. లేదా గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ నుంచి ఇంజనీరింగ్(మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ)లో కనీసం 50 శాతం స్కోర్‌తో మూడేళ్ల డిప్లొమా కోర్సు చేసి ఉండాలి. ఇంగ్లీష్‌లోనూ 50 శాతం మార్కులు పొంది ఉండాలి. ఒకవేళ డిప్లొమాలో ఇంగ్లీష్ సబ్జెక్ట్ లేకపోతే పదో తరగతి ఇంగ్లీష్ సబ్జెక్ట్‌ను పరిగణనలోకి తీసుకుంటారు.

సైన్స్ కాకుండా ఇతర సబ్జెక్టులు చదివిన అభ్యర్థులు ఇంటర్ పాసై ఉండాలి. లేదా అందుకు సమానమైన ఎగ్జామ్‌లో కనీసం 50 శాతం స్కోర్‌తో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంగ్లీష్‌లోనూ తప్పనిసరిగా కనీసం 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి.

మేము అందించే మొత్తం సమాచారం మీకు నచ్చితే, ప్రతిరోజూ కొత్త ఉద్యోగ సమాచారం కోసం మా వాట్సాప్ గ్రూప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి. మేము ప్రతిరోజూ ఉద్యోగ సమాచారాన్ని మీకు నేరుగా పోస్ట్ చేస్తాము. దయచేసి మేము అందించిన ఉద్యోగ సమాచారం యొక్క చివరి భాగంలో దరఖాస్తు చివరి తేదీ మరియు ప్రారంభ తేదీని స్పష్టంగా చదివి, ఆపై దరఖాస్తు చేయండి.

ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

మా వాట్సాప్ గ్రూప్ లో చేరడానికి Click Here 
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి Click Here

ప్రత్యేక నోటీసు :- ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది సువర్ణావకాశం. ఈ విధంగా, ఆసక్తి గల అభ్యర్థులు ఉద్యోగ బడి వెబ్‌సైట్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు అంటే కర్ణాటక ఉద్యోగాల నవీకరణ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు, ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు & పార్ట్ టైమ్/ఫుల్ టైమ్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

మీ దృష్టికి :- మేము అందించిన అన్ని ఉద్యోగ సమాచారం పూర్తిగా ఉచితం మరియు ఏ అభ్యర్థుల నుండి డబ్బు తీసుకోబడదు. ఎవరైనా ఉద్యోగ బడి పేరుతో డబ్బులు అడిగితే వెంటనే మా ఈమెయిల్ అడ్రస్ కు మెసేజ్ చేసి మా దృష్టికి తీసుకురావాలి.

* అప్లికేషన్ ప్రాసెస్

– ముందు అధికారిక పోర్టల్ agnipathvayu.cdac.in ఓపెన్ చేయాలి. హోమ్‌పేజీలోకి వెళ్లి రిక్రూట్‌మెంట్ సెక్షన్‌పై క్లిక్ చేయాలి.

– దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అవసరమైన పర్సనల్ వివరాలను ఎంటర్ చేసి, రిజిస్టర్ అవ్వాలి.

– తర్వాత రిజిస్టర్ ఐడీ సాయంతో లాగిన్ అవ్వాలి. అగ్నివీర్‌ వాయు అప్లికేషన్ ఫారమ్‌ను ఓపెన్ చేసి అవసరమైన వివరాలు నింపాలి.

– అప్లికేషన్ ఫీజు చెల్లించి, చివరగా ఫారమ్‌ను సబ్‌మిట్ చేయాలి.

* అప్లికేషన్ ఫీజు

అభ్యర్థులు రూ.250 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. డెబిట్ కార్డ్ , క్రెడిట్‌కార్డ్, ఇంటర్‌నెట్ బ్యాకింగ్ ద్వారా ఫీజు చెల్లించాలి.

ఇది కూడా చదవండి : 

Scholarship 2023: ఈ నెలలో అప్లై చేసుకోవాల్సిన స్కాలర్‌షిప్స్ వివరాలివే..!

గ్రామ పంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

* ఎంపిక ప్రక్రియ

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. మొదటి దశలో ఆన్‌లైన్ రాత పరీక్ష, రెండో దశలో ఆన్‌లైన్ ఎగ్జామ్‌తో పాటు ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్(PFT), అడాప్టబిలిటీ టెస్ట్ 1 & 2 ఉంటుంది. చివరి దశలో మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ఎంపికయ్యే అభ్యర్థుల జాబితాను ఫిబ్రవరిలో ప్రకటించనున్నారు.

* ఎగ్జామ్ ప్యాట్రన్

రాత పరీక్షలు అక్టోబర్ 13 నుంచి ప్రారంభం కానున్నాయి. ఎగ్జామ్స్ అబ్జెక్టివ్ టైప్‌లో ఉంటాయి. సైన్స్ సబ్జెక్ట్ అభ్యర్థుల పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. నాన్ సైన్స్ అభ్యర్థుల పరీక్ష వ్యవధి 45 నిమిషాలు. రీజనింగ్, జనరల్ అవెర్‌నెస్ నుంచి ప్రశ్నలు ఉంటాయి.

* అడ్మిట్ కార్డ్

మొదటి దశ ఎగ్జామ్ కోసం అడ్మిట్‌కార్డ్‌లను పరీక్షకు రెండు నుంచి నాలుగు రోజుల ముందు జారీ చేస్తారు. అభ్యర్థులు అడ్మిట్ కార్డును కలర్ ప్రింటౌట్ తీసుకొని ఎగ్జామ్ సెంటర్‌కు తీసుకెళ్లాలి.

మా లక్ష్యం :- ప్రతి అభ్యర్థికి తాజా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారాన్ని పొందే హక్కు ఉందని మేము విశ్వసిస్తున్నాము, కాబట్టి మేము ఈ ఉద్యోగ నోటిఫికేషన్‌ను భాగస్వామ్యం చేస్తున్నాము. మీరు ప్రభుత్వ ఉద్యోగాలు లేదా తాజా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం చూస్తున్నట్లయితే, మీరు మా ముందస్తు ఉద్యోగ శోధనను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు

Leave a comment