Central Got Jobs 2023: మరికొన్ని గంటలే సమయం..త్వరపడండి.. 9,053 ఉద్యోగాలు!

Central Got Jobs 2023: మరికొన్ని గంటలే సమయం..త్వరపడండి.. 9,053 ఉద్యోగాలు!

శంలోని రీజినల్ రూరల్ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసే నియామక పరీక్ష కోసం ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

దరఖాస్తుల చేసుకునేందుకు జూన్ 21 వరకు మాత్రమే గడవు ఉంది. ఈలోగా అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

క్లర్క్‌, పీఓ, ఆఫీసర్స్‌ స్కేల్‌ II, III స్థాయి పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులను అర్హులుగా నిర్ణయించారు. ఆన్‌లైన్‌ టెస్ట్‌ (ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు https://www.ibps.in/ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలను చూడటంతో పాటు అప్లయ్‌ చేసుకోవచ్చు.

ఏ శాఖలో ఎన్నీ ఖాళీలున్నాయంటే:

ఆఫీస్‌ అసిస్టెంట్‌(మల్టీపర్పస్‌) 5,650 ఉండగా.. ఆఫీసర్‌ స్కేల్‌ I(ఏఎం) పోస్టులు 2563, ఆఫీసర్‌ స్కేల్‌ II జనరల్‌ బ్యాంకింగ్‌ ఆఫీసర్‌ 367, ఆఫీసర్‌ స్కేల్‌-2 (ఐటీ) 106, ఆఫీసర్‌ 2 (సీఏ) 63, ఆఫీసర్‌ స్కేల్‌ 2 (లా ఆఫీసర్‌) 56, ట్రజరీ ఆఫీసర్‌ స్కేల్‌- 2 పోస్టులు 16, మార్కెటింగ్‌ ఆఫీసర్‌ 38, అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ స్కేల్‌ -2 పోస్టులు 118, ఆఫీసర్‌ స్కేల్‌ -3 పోస్టులు 76 చొప్పున ఉన్నాయి.

ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ క్లర్కు, పీవో (అసిస్టెంట్‌ మేనేజర్‌) విద్యార్హత గ్రాడ్యుయేషన్‌ ఉంటే చాలు. ఎలాంటి అనుభవం అవసరంలేదు. ఆఫీసర్‌ స్కేల్‌- 2 జనరల్‌ బ్యాంకింగ్ ఆఫీసర్‌ (మేనేజర్‌) పోస్టులకు గ్రాడ్యుయేషన్‌లో 50శాతం మార్కులు ఉండాలి. ఏదైనా బ్యాంకు/ఫైనాన్సియల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో రెండేళ్ల పాటు పనిచేసిన అనుభవం తప్పనిసరి.

వేతనం: ఉద్యోగాల హోదాలను బట్టి నెలకు కనీస వేతనం రూ.15,000 నుంచి గరిష్ఠంగా రూ.44,000 వరకు ఉండొచ్చు.

పరీక్ష విధానం:

కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ఆధారంగా నియమాక ప్రక్రియ ఉంటుంది. క్లర్క్ పోస్టులకు రెండు దఫాలుగా పరీక్షలు ఉంటాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసిన వారు ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. పీవో(స్కేల్ 1), స్కేల్ 2, స్కేల్ 3 పోస్టులకు అప్లై చేసిన వారికి మూడు ఫేజుల్లో ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ ఉంటుంది.

ఎగ్జామ్ క్యాలెండర్ ప్రకారం.. ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ పీవో, క్లర్క్ పరీక్ష ఆగస్ట్ 5, 6, 12, 13, 19 తేదీల్లో ఉండనుంది. మరోవైపు, స్కేల్ 2, స్కేల్ 3 పరీక్షలు సెప్టెంబర్ 10న ఉంటాయి. ఇందులో అర్హత సాధించిన వారికి నవంబర్‌లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. నాబార్డ్, ఐబీపీఎస్ అధికారులు సమన్వయంతో ఈ ఇంటర్వ్యూ ప్రక్రియ ఉంటుంది.

ఇలా అప్లై చేసుకోండి..

– ముందు ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ ibps.in ఓపెన్ చేయాలి.

– హోం పేజీలో కనిపిస్తున్న ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ అప్లై ఆన్‌లైన్ లింక్‌పై క్లిక్ చేయాలి.

– వ్యక్తిగత వివరాలను ఫిల్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.

– తర్వాత అప్లికేషన్ ఫారం ఫిల్ చేసి అడిగిన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.

– పరీక్ష ఫీజు చెల్లించి రిసీప్ట్‌ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ రిసీప్ట్‌ని ప్రింట్ చేసుకుని భవిష్యత్ అవసరాల కోసం సేవ్ చేసుకోవాలి.

ముఖ్యమైన లింకులు
నోటిఫికేషన్: ఇక్కడ క్లిక్ చేయండి
దరఖాస్తు చేయడానికి లింక్ కోసం: ఇక్కడ క్లిక్ చేయండి
టెలిగ్రామ్ సమూహం: ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: మేము మా వెబ్‌సైట్‌లో జాబితా చేసిన ఏదైనా ఉద్యోగాలకు దరఖాస్తు / షార్ట్‌లిస్ట్ చేయడానికి జీతం పొందడానికి భారత ప్రభుత్వ ఉద్యోగాలు ఏ అభ్యర్థిని పిలవవు/ అడగవు, దయచేసి IOCL ఉద్యోగాల కోసం ఎవరికీ ఎటువంటి మొత్తాన్ని చెల్లించవద్దు. ”

మా లక్ష్యం:  తాజా ప్రభుత్వ ఉద్యోగాల హెచ్చరికను పొందడానికి ప్రతి అభ్యర్థులకు హక్కులు ఉన్నాయని మేము విశ్వసిస్తున్నాము, కాబట్టి మేము IOCL ఉద్యోగ నోటిఫికేషన్‌ను భాగస్వామ్యం చేస్తున్నాము. మీరు ప్రభుత్వ ఉద్యోగాలు లేదా తాజా సర్కారీ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం చూస్తున్నట్లయితే, మీరు మా ముందస్తు ఉద్యోగ శోధనను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు

Leave a comment