ఉచితంగా రూ.22 వేలు పొందండి.. మోదీ సర్కార్ బంపర్ ఆఫర్!

ఉచితంగా రూ.22 వేలు పొందండి.. మోదీ సర్కార్ బంపర్ ఆఫర్!

మీరు ఉచితంగానే రూ. 22 వేలు పొందొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఆగస్ట్ 15 వరకే ఛాన్స్ ఉంటుంది.

Schemes | కేంద్ర ప్రభుత్వం అదిరే ఆఫర్ అందుబాటులో ఉంచింది. ఉచితంగానే రూ. 22 వేలు పొందే వెసులుబాటు కల్పిస్తోంది. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. మోదీ (Modi) సర్కార్ రెండు కాంటెస్ట్‌లు నిర్వహిస్తోంది. వీటిల్లో పాల్గొని విజేతగా నిలిస్తే ఏకంగా రూ.22,000 పొందొచ్చు.

ఈ కాంటెస్ట్ పరిమిత కాలం వరకే అందుబాటులో ఉంటుంది. అందువల్ల డబ్బులు (Money) పొందాలని భావించే వారు ఈ పోటీలో పాల్గొనవచ్చు. ఈ కాంటెస్ట్ పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కేంద్ర ప్రభుత్వం కృషి కరమయోగి అభియాన్ కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మార్స్ వెల్ఫేర్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి మరింత తీసుకువెళ్లేందుకు మోదీ సర్కార్ తాజాగా మైగౌవ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా కృషి కరమయోగి అభియాన్‌కు ఒక లోగో డిజైన్ చేయాల్సి ఉంటుంది.

అగ్రికల్చర్‌కు సంబంధించిన థీమ్ ఆధారంగా లోగో డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఈ కాంటెస్ట్‌లో పాల్గొన్న వారికి ఇసర్టిఫికెట్ అందిస్తారు. అలాగే విజేతగా నిలిచిన వారికి రూ. 11 వేలు అందజేస్తారు. ఆగస్ట్ 15 వరకు ఈ కాంటెస్ట్ ఉంటుంది. అందువల్ల మీరు అప్లై చేసుకోవాలని భావిస్తే.. వెంటనే లోగో డిజైన్ చేసి సబ్‌మిట్ చేయొచ్చు. అలాగే కేంద్ర ప్రభుత్వం మరో కాంటెస్ట్ కూడా నిర్వహిస్తోంది. ఇది కూడా కృషి కరమయోగి అభియాన్ కార్యక్రమానికి సంబంధించినదే.

అందువల్ల ఎవరైతే కృషి కరమయోగి అభియాన్‌ లోగో డిజైన్ చేయాలని భావించే వారు ఈ మరో కొత్త కాంటెస్ట్‌లో కూడా పాల్గొనవచ్చు. ఈ కొత్త కాంటెస్ట్‌లో భాగంగా ట్యాగ్ లైన్ పెట్టాల్సి ఉంటుంది. కృషి కరమయోగి అభియాన్‌కు అదిరిపోయే ట్యాగ్ లైన్ ఉంది. ఈ కాంటెస్ట్‌లో విజేతగా నిలిచిన వారికి కూడా రూ. 11 వేలు అందిస్తారు. అలాగే ఒక ఇ-సర్టిఫికెట్ కూడా ఇస్తారు. అందువల్ల ఈ రెండు కాంటెస్ట్‌లలో పాల్గొని విజేతగా నిలిస్తే.. ఏకంగా రూ. 22 వేలు పొందొచ్చు.

ఏదో ఒక్క దానిలో విజేతగా నిలిచిన రూ.11 వేలు సొంతం చేసుకోవచ్చు. మైగౌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీరు ఈ కాంటెస్ట్‌లో పాల్గొనవచ్చు. ఈ రెండు కాంటెస్ట్‌లు కూడా ఆగస్ట్ 15 వరకే అందుబాటులో ఉంటాయి. అందు వల్ల ఆలస్యం చేయకుండా ఈ కాంటెస్ట్‌లో పాల్గొనవచ్చు. ఉచితంగా డబ్బులు పొందొచ్చు.