సామాన్యులకు కేంద్రం భారీ శుభవార్త.. కీలక నిర్ణయం!

కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తీసుకువచ్చింది. సామాన్యులకు ఊరట కలిగే ప్రకటన చేసింది. దీని వల్ల ధరల పెంపు బాదుడు ఉండకపోవచ్చు.

Onion Rate | టమోటా ధరలు కొండెక్కి కూర్చుకున్నాయి. బియ్యం (Rice) ధరలు కూడా పెరిగిపోయాయి. అలాగే రానున్న కాలంలో ఉల్లి ధరలు (Price) కూడా భారీగా పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి. అయితే ఈ క్రమంలోనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. అదిరే శుభవార్త తీసుకు వచ్చింది. సామాన్యులకు ఊరట కలిగే ప్రకటన చేసింది. దీని వల్ల చాలా మందిపై సానుకూల ప్రభావం ఉంటుందని చెప్పకోవచ్చు.

ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

మా వాట్సాప్ గ్రూప్ లో చేరడానికి Click Here 
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి Click Here

ఉల్లి ధరలు పెరగొచ్చనే అంచనాలకు మోదీ సర్కార్ చెక్ పెట్టేసింది. కీలక నిర్ణయం తీసుకుంది. బఫర్ స్టాక్ కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. 3 లక్షల టన్నుల ఉల్లి గడ్డలను కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. గత ఏడాది ఉల్లి బఫర్ స్టాక్‌తో పోలిస్తే.. ఇది ఏకంగా 20 శఆతం ఎక్కువ. వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. 2022- 2023 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 2.5 లక్షల టన్నుల ఉల్లిని బఫర్ స్టాక్ కింద కొనుగోలు చేసింది.

సరఫరా తక్కువగా ఉన్న సీజన్‌లో ధరలు పెరగకుండా చూడటానికి బఫర్ స్టాక్ ఉపయోగిస్తారు. ప్రైస్ స్టెబిలైజేష్ ఫండ్ ద్వారా బఫర్ స్టాక్‌ను కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా ఉల్లిని ఎక్కువ కాలం నిల్వ ఉంచేలా బాటా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రబీ సీజన్‌లో పండించిన ఉల్లిని కేంద్రం బఫర్ స్టాక్ కింద కొనుగోలు చేసింది. అలాగే ఖరీఫ్ ఉల్లి సాగు ప్రారంభం అయ్యింది. అక్టోబర్‌లో ఉల్లి పంట మార్కెట్‌లోకి రానుంది.

ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

మా వాట్సాప్ గ్రూప్ లో చేరడానికి Click Here 
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి Click Here

Leave a comment