Govt Scheme: 21 ఏళ్లకే అకౌంట్‌లోకి రూ.55 లక్షలు.. ప్రభుత్వం అదిరే స్కీమ్!

Govt Scheme: 21 ఏళ్లకే అకౌంట్‌లోకి రూ.55 లక్షలు.. ప్రభుత్వం అదిరే స్కీమ్!

Saving Schemes | 21 ఏళ్లకే అకౌంట్‌లోకి రూ. 51 లక్షలు వస్తాయి. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ స్కీమ్ గురించి తెలుసుకోవాల్సిందే. కచ్చితమైన రిస్క్ పొందొచ్చు.

Small Saving Schemes | ప్రభుత్వం పలు రకాల స్కీమ్స్ అందిస్తోంది. వీటిల్లో చిన్న పిల్లల కోసం మరీముఖ్యంగా ఆడ పిల్లల కోసం కేంద్రం అదిరే పథకాన్ని అందిస్తూ వస్తోంది. దీని పేరు సుకన్య సమృద్ధి స్కీమ్. ఇందుల చేరడం వల్ల అదిరే రాబడి పొందొచ్చు. ఇంకా ట్యాక్స్ (Tax) బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అందువల్ల ఈ స్కీమ్‌లో (Scheme) చేరిన వారికి డబుల్ బెనిఫిట్ లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ స్కీమ్ ద్వారా రూ. 55 లక్షలు ఎలా పొందొచ్చొ తెలుసుకుందాం.

ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

మా వాట్సాప్ గ్రూప్ లో చేరడానికి Click Here 
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి Click Here

సుకన్య సమృద్ధి స్కీమ్ అనేది కేవలం ఆడ పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది. అది కూడా పదేళ్లకు లోపు వయసు ఉన్న వారికే ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. అందువ్లల మీరుఈ విషయాన్ని గుర్తించుకోవాలి. ఒక ఇంట్లో గరిష్టంగా ఇద్దరు అమ్మాయిలే ఈ పథకంలో చేరొచ్చు. కవలలు పుడితే ముగ్గురు కూడా ఈ స్కీమ్‌లో చేరడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మీ ఇంట్లో కూడా అమ్మాయి ఉంటే.. వెంటనే వారికి ఈ స్కీమ్‌లో చేర్పించండి.

ఈ పథకంలో చేరడం వల్ల ఆదాయప పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందొచ్చు. ఆర్థిక సంవత్సరంలో రూ. 1.5 లక్షల వరకు ట్యాక్స్ బెనిఫిట్ సొంతం చేసుకోవచ్చు. మీరు దగ్గరిలోని పోస్టాఫీస్ లేదా బ్యాంక్‌కు వెళ్లి సుకన్య ఖాతా తెరవొచ్చు. రూ. 250తో మీరు ఈ పని పూర్తి చేయొచ్చు. మీరు గరిష్టంగా ఈ స్కీమ్‌లో ఏడాదికి రూ. 1.5 లక్షల వరకే ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే నెలకు రూ. 12,500 వరకు డబ్బులు దాచుకోవచ్చు.

ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 21 ఏళ్లు. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 8 శాతం వడ్డీ వస్తోంది. ఇది ఆకర్షణీయ వడ్డీ రేటు అని చెప్పుకోవచ్చు. ఇదివరకు ఈ వడ్డీ రేటు 7.6 శాతంగానే ఉండేది. ఏప్రిల్ 1 నుంచి వడ్డీ రేటు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని వల్ల ఈ స్కీమ్‌లో చేరిన వారికి ఎక్కువ రాబడి వస్తుందని చెప్పుకోవచ్చు.

నెలకు మీరు . 10 వేలు పొదుపు చేయాలని భావిస్తే.. మెచ్యూరిటీ సమయంలో ఏకంగా రూ. 55 లక్షలు వస్తాయి. ఇది భారీ రిటర్న్ అని చెప్పుకోవచ్చు. అయితే దీర్ఘకాలం వరకే వేచి ఉండాలి. ఈ స్కీమ్‌లో చేరిన వారు వరుసగా 15 ఏళ్ల పాటు డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.

ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

మా వాట్సాప్ గ్రూప్ లో చేరడానికి Click Here 
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి Click Here