Government Scheme: ప్రభుత్వ స్కీమ్ అదిరింది.. ప్రతి నెలా రూ.14 వేలు పొందండిలా, రోజుకు రూ.100 కడితే చాలు!

Government Scheme: ప్రభుత్వ స్కీమ్ అదిరింది.. ప్రతి నెలా రూ.14 వేలు పొందండిలా, రోజుకు రూ.100 కడితే చాలు!

National Pension System | మీరు ప్రతి నెలా రూ. 14 వేలు పొందాలని భావిస్తున్నారా? అయితే రోజుకు రూ.100 కడితే సరిపోతుంది. ఎలా అని అనుకుంటున్నారా? ఈ విషయం తెలుసుకోవాల్సిందే.

Savings Schemes | మీరు ప్రతి నెలా రూ .14 వేలు పొందాలని చూస్తున్నారా? అయితే మీకు శుభవార్త. ఎందుకుంటే అదిరే ఆప్షన్ అందుబాటులో ఉంది. కేంద్ర ప్రభుత్వం సూపర్ డూపర్ స్కీమ్ అందిస్తోంది. ఇందులో చేరడం వల్ల మీరు నెల నెలా డబ్బులు (Money) పొందొచ్చు.

అంతేకాకుండా ఈ పథకంలో చేరడం వల్ల మీకు డబ్బులు ఇబ్బంది ఏమీ ఉండదు. రిస్క్ లేకుండా రాబడి సొంతం చేసుకోవచ్చు. ఇంతకీ అది ఏ స్కీమ్ అని అనుకుంటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ప్రభుత్వం నేషనల్ పెన్షన సిస్టమ్ (NPS) పేరుతో ఒక పథకాన్ని అందిస్తోంది. దీని ద్వారా పలు బెనిఫిట్స్ పొందొచ్చు.

ఎన్‌పీఎస్ అనేది ఒక రిటైర్మెంట్ స్కీమ్. ఇందులో చేరడం వల్ల ప్రతి నెలా పెన్షన్ పొందొచ్చు. 60 ఏళ్లు వచ్చిన తర్వాతి నుంచి ప్రతి నెలా డబ్బులు పొందొచ్చు. మెచ్యూరిటీ సమయంలో ఒకేసారి చేతికి భారీ మొత్తం వస్తుంది. ఇంకా ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అందుకే ఈ స్కీమ్‌లో చేరడం వల్ల మూడు రకాల బెనిఫిట్స్ పొందొచ్చు. ఒకేసారి భారీ మొత్తం వస్తుంది. ఇంకా ప్రతి నెలా పెన్షన్ పొందొచ్చు. అలాగే ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.

మీరు ఈ స్కీమ్‌లో చేరడం ద్వారా ప్రతి నెలా డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదంటే ఏడాదికి ఒకేసారి డబ్బులు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. మీకు 70 ఏళ్లు వచ్చే వరకు ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగించొచ్చు. 60 ఏళ్లు వచ్చిన తర్వాత మీరు ఈ స్కీమ్ నుంచి 60 శాతం డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగతా 40 శాతం మొత్తంతో యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల మీకు ప్రతి నెలా పెన్షన్ వస్తుంది. మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం ఆధారంగా మీకు వచ్చే బెనిఫిట్స్ కూడా మారతాయి.

నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీకు రూ. 50వేల వరకుఅదనపు ట్యాక్స్ బెనిఫిట్ లభిస్తుంది. సెక్ష్ 80సీడీ (1బీ), సెక్షన్ 80 సీ కింద పన్ను మనిహయాంపు పొందొచ్చు. మొత్తంగా రూ. 2 లక్షల వరకు ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. మీరు ఉదాహరణకు 30 ఏళ్ల వయసులో ఉన్న వారు ఈ స్కీమ్‌లో ప్రతి నెలా రూ. 3 వేలు ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. ఇప్పుడు వార్షిక రాబడి 10 శాతం ప్రకారం చూస్తే..

ఎన్‌పీఎస్ అకౌంట్‌లో 60 ఏళ్లు వచ్చేసరికి రూ. 68 లక్షలు ఉంటాయి. ఇందులో రూ. 27 లక్షలు పెట్టి యాన్యుటీ ప్లాన్ కొనాలి. అప్పుడు ప్రతి నెలా దాదాపు రూ.14 వేల పెన్షన్ వస్తుంది. ఇక రూ.41 లక్షలు ఒకేసారి చేతికి వస్తాయి.