HCL Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఐటీఐ పాసైతే చాలు, ఈ ప్రభుత్వ ఉద్యోగం

HCL Jobs: ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్(HCL)లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆసక్తి గల అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాలని సూచించింది.

ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్(HCL)లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మధ్యప్రదేశ్‌లోని మలంజ్‌ఖండ్ కాపర్ ప్రాజెక్టులో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు సంస్థ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు అభ్యర్థులకు ఉండాల్సిన అర్హత, వయసు పరిమితి, పోస్టుల వివరాలు, శిక్షణ కాలం, తదితర వివరాలను నోటిఫికేషన్‌లో వివరంగా పొందుపర్చింది. అవేంటో చూద్దాం.

మేము అందించే మొత్తం సమాచారం మీకు నచ్చితే, ప్రతిరోజూ కొత్త ఉద్యోగ సమాచారం కోసం మా వాట్సాప్ గ్రూప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి. మేము ప్రతిరోజూ ఉద్యోగ సమాచారాన్ని మీకు నేరుగా పోస్ట్ చేస్తాము. దయచేసి మేము అందించిన ఉద్యోగ సమాచారం యొక్క చివరి భాగంలో దరఖాస్తు చివరి తేదీ మరియు ప్రారంభ తేదీని స్పష్టంగా చదివి, ఆపై దరఖాస్తు చేయండి.

ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

మా వాట్సాప్ గ్రూప్ లో చేరడానికి Click Here 
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి Click Here

ప్రత్యేక నోటీసు :- ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది సువర్ణావకాశం. ఈ విధంగా, ఆసక్తి గల అభ్యర్థులు ఉద్యోగ బడి వెబ్‌సైట్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు అంటే కర్ణాటక ఉద్యోగాల నవీకరణ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు, ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు & పార్ట్ టైమ్/ఫుల్ టైమ్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

మీ దృష్టికి :- మేము అందించిన అన్ని ఉద్యోగ సమాచారం పూర్తిగా ఉచితం మరియు ఏ అభ్యర్థుల నుండి డబ్బు తీసుకోబడదు. ఎవరైనా ఉద్యోగ బడి పేరుతో డబ్బులు అడిగితే వెంటనే మా ఈమెయిల్ అడ్రస్ కు మెసేజ్ చేసి మా దృష్టికి తీసుకురావాలి.

HCL Jobs పూర్తి ఉద్యోగ వివరాలు

* అర్హత

ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్(ఐటీఐ) పూర్తి చేసిన వారు అర్హులు. పదో తరగతి కూడా పాసై ఉండాలి. ఈ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారిక ప్రకటనలో ఫేర్కొంది.

* వయసు

అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి అభ్యర్థులకు కనీస వయసు 18 సంవత్సరాలు ఉండాలి. గరిష్ఠ వయసు 25 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం సడలింపు ఉంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు ఎక్కువ పరిమితి ఉంటుంది.

* ఖాళీలు, శిక్షణ కాలం

పోస్టుల ప్రకారం, ఎంపికైన వారికి ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. మొత్తంగా వివిధ విభాగాల్లో కలిపి 184 ఖాళీలు ఉన్నాయి. మేట్(మైన్స్) పోస్టుకు మూడేళ్ల పాటు శిక్షణ ఉంటుంది. బ్లాస్టర్(మైన్స్), డీజిల్ మెకానిక్‌లకు రెండేళ్లు; ఫిట్టర్‌కి, టర్నర్‌, వెల్డర్(గ్యాస్, ఎలక్ట్రిక్), డ్రాట్స్‌మెన్(మెకానికల్) పోస్టులకు ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. ఇక, కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్‌, సర్వేయర్‌, ఏసీ, రిఫ్రిజిరేషన్ ఆపరేటర్, కార్పెంటర్, ప్లంబర్, హార్టికల్చర్ అసిసటెంట్, ఇన్‌స్ట్రూమెంట్ మెకానిక్స్‌కి సంవత్సరం పాటు ట్రైనింగ్ ఉంటుంది.

* ముఖ్యమైన తేదీలు

ఈ పోస్టులకు ఇప్పటికే అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 5. ఎంపికైన అభ్యర్థుల జాబితాను సంస్థ సెప్టెంబర్ 19న విడుదల చేస్తుంది.

* దరఖాస్తు విధానం..

– అర్హతలు అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ hindustancopper.com ఓపెన్ చేయాలి.

– అనంతరం “Establishment Search” ఆప్షన్‌లో ఈ పోస్టుకు సంబంధించి ఉన్న లింక్‌పై క్లిక్ చేయాలి.

– ఇక్కడ అవసరమైన వివరాలను నింపి పాస్‌పోర్ట్ సైజు ఫొటో, సంతకం, మార్క్‌షీట్స్‌ వంటి డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.

– చివరకు అప్లికేషన్ సబ్మిట్ చేసి, భవిష్యత్ రిఫరెన్స్ కోసం కాపీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

* ఎంపిక ప్రక్రియ

ఐటీఐ, పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. 10వ తరగతి మార్కుల నుంచి 70 శాతం, ఐటీఐ మార్కుల నుంచి 30 శాతం వెయిటేజీని పరిగణిస్తారు. ఒకవేళ ఇద్దరు, అంతకంటే ఎక్కువ మందికి సమాన మార్కులు వస్తే గరిష్ఠ వయసు కలిగిన అభ్యర్థిని ఎంపిక చేస్తారు. అయితే, HCL షరతుల మేరకు అభ్యర్థులు మెడికల్‌గా ఫిట్‌గా ఉండాలి.

ఇది కూడా చదవండి : 

Scholarship 2023: ఈ నెలలో అప్లై చేసుకోవాల్సిన స్కాలర్‌షిప్స్ వివరాలివే..!

గ్రామ పంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

IAF Agniveer Jobs 2023: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నివీర్‌ ఉద్యోగాలు.. అర్హత, అప్లికేషన్ ప్రాసెస్ వివరాలు

మా లక్ష్యం :- ప్రతి అభ్యర్థికి తాజా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారాన్ని పొందే హక్కు ఉందని మేము విశ్వసిస్తున్నాము, కాబట్టి మేము ఈ ఉద్యోగ నోటిఫికేషన్‌ను భాగస్వామ్యం చేస్తున్నాము. మీరు ప్రభుత్వ ఉద్యోగాలు లేదా తాజా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం చూస్తున్నట్లయితే, మీరు మా ముందస్తు ఉద్యోగ శోధనను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు

Leave a comment