Women scheme:మహిళలకు బ్యాంక్ నుండి బంపర్ పథకం.. కీలక ప్రకటన!

Women scheme:మహిళలకు బ్యాంక్ నుండి బంపర్ పథకం.. కీలక ప్రకటన!

Mahila Scheme

 Mahila Scheme: Bumper Scheme from Bank for Women.. Key Announcement!| బ్యాంక్ గుడ్ న్యూస్ అందించింది. మీకు కొత్త స్కీమ్ అందుబాటులోకి వచ్చింది. దీని వల్ల చాలా మందికి బెనిఫిట్ కలుగనుంది.

Small Saving Schemes | ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న బ్యాంక్ ఆఫ్ బరోడా తాజాగా తీపికబురు అందించింది. అదిరే ప్రకటన చేసింది. మహిళల కోసం స్పెషల్ స్కీమ్‌ను (Scheme) అందుబాటులో ఉంచింది.

Mahila Scheme: Bumper Scheme from Bank for Women.. Key Announcement!

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు బ్యాంక్ (Bank) వెల్లడించింది. అందువల్ల ఈ స్కీమ్‌లో చేరాలని భావించే వారు ఇప్పుడు బ్యాంక్‌కు వెళ్లి సులభంగానే చేరొచ్చు. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్‌ను అందిస్తున్న మూడో బ్యాంక్ ఇది. ఇప్పటికే కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చాయి. ఇప్పటికే ఈ స్కీమ్ పోస్టాఫీస్‌లో కూడా అందుబాటులో ఉంది.

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ అనేది డిపాజిట్ స్కీమ్. దీని టెన్యూర్ రెండేళ్లు. ఈ స్కీమ్‌ల చేరితే 7.5 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఈ పథకం కొంత కాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది. 2025 మార్చి 31 వరకే ఈ స్కీమ్‌లో చేరడానికి అవకాశం ఉంటుంది. మహిళలకు మాత్రమే ఈ స్కీమ్‌లో చేరడానికి అవకాశం ఉంటుంది. చిన్న పిల్లల పేరుపై కూడా ఈ పథకంలో చేరొచ్చు. అయితే వీరికి గార్డియన్ ఉండాలి.

ఈ కొత్త స్కీమ్‌లో చేరిన వారు రూ. 2 లక్షల వరకు డబ్బులు దాచుకోవచ్చు. ఒకేసారి రూ.2 లక్షల మొత్తాన్ని డిపాజిట్ చేయొచ్చు. లేదంటే చిన్న చిన్న మొత్తంలో కూడా డబ్బులు దాచుకోవచ్చు. గరిష్టంగా రూ. 2 లక్షల వరకు డిపాజిట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఉదాహరణకు మీరు రూ. 20 వేల చొపున పది సార్లు ఈ స్కీమ్‌లో డబ్బులు దాచుకోవచ్చు. అయితే ఒకసారి డబ్బులు డిపాజిట్ చేసిన తర్వాత మూడు నెలల వరకు వేచి ఉండాలి. తర్వాత మళ్లీ డబ్బులు దాచుకోవచ్చు.

Mahila Scheme: Bumper Scheme from Bank for Women.. Key Announcement!

త్రైమాసికం చొప్పున వడ్డీ చెల్లిస్తారు. మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీమ్‌లోనే వడ్డీ డబ్బులు జమ అవుతాయి. మెచ్యూరిటీ సమయంలో ఒకేసరి తీసుకోవచ్చు. స్కీమ్‌లో చేరితన ఏడాది తర్వాత 40 శాతం మొత్తాన్ని విత్‌డ్రా చేకోవచ్చు. స్కీమ్‌లో చేరిన ఆరు నెలల తర్వాత పథకం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలని భావిస్తే.. అప్పుడు వారికి 5.5 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. అంటే వడ్డీ రేటు 2 శాతం తగ్గుతుంది. ఇకపోతే బ్యాంక్ ఆఫ్ బరోడా అన్ని బ్యాంక్ బ్రాంచ్‌లోనూ ఈ స్కీమ్ లభిస్తుంది.