ఒక రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు.. 30 వేలు గెలుచుకునేందుకు కేంద్రం బంపర్ ఆఫర్!

ఒక రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు.. 30 వేలు గెలుచుకునేందుకు కేంద్రం బంపర్ ఆఫర్!

కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆన్లైన్ వ్యాసరచన పోటీని నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొని విజేతగా నిలిస్తే.. రూ. 30 వేలు పొందవచ్చు.
కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పోటీ నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొని విజేతగా నిలిస్తే 30 వేల డబ్బు (విన్ ప్రైజ్ మనీ) సంపాదించవచ్చు. అయితే ఈ పోటీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.

ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

మా వాట్సాప్ గ్రూప్ లో చేరడానికి Click Here 
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి Click Here

కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆన్లైన్ వ్యాసరచన పోటీని నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొని విజేతగా నిలిస్తే.. రూ. 30 వేలు పొందవచ్చు. మీరు My Gov వెబ్సైట్లో ఈ పోటీలో పాల్గొనవచ్చు.

కంస్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (CAG) ఈ జాతీయ ఆన్లైన్ వ్యాస రచన పోటీని నిర్వహిస్తోంది. ఆడిట్ దివస్ వేడుకల్లో భాగంగా ఈ పోటీని నిర్వహిస్తున్నారు. ‘భారత ప్రజాస్వామ్యంలో కాగ్ పాత్ర’ అనే అంశంపై ఒక వ్యాసం రాయాల్సి
ఉంది.

కాగ్ సంస్థపై దేశంలోని యువతకు అవగాహన కల్పించడమే ఈ పోటీల ప్రధాన లక్ష్యం. జవాబుదారీతనం మరియు సుపరిపాలనను ప్రోత్సహించడంలో CAG యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేయడానికి ఈ వ్యాస రచన పోటీ నిర్వహించబడుతుంది.

కావున ఆసక్తి గలవారు ఈ పోటీలో పాల్గొనగలరు. ఈ పోటీ పరిమిత సమయం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీరు వెంటనే ఈ పోటీలో పాల్గొనవచ్చు.

ఈ పోటీలో విజేతలకు రూ.30 వేలు పొందవచ్చు. ఇది మొదటి విజేతకు వర్తిస్తుంది. అలాగే రెండో బహుమతిగా రూ.20 వేలు వస్తాయి. మరియు మూడవ బహుమతి రూ. 15 వేలు లభిస్తుంది. ఈ విధంగా మూడు బహుమతులు ఇవ్వబడతాయి. ఈ పోటీలో పాల్గొనేందుకు ఎలాంటి రుసుము లేదు. అలాగే రిజిస్ట్రేషన్ ఫీజు లేదు. కాబట్టి మీరు ఈ పోటీలో సులభంగా పాల్గొనవచ్చు.

25 ఏళ్లు పైబడిన వారు ఈ పోటీలో పాల్గొనేందుకు అర్హులు కాదు. ఏదైనా యూనివర్సిటీలో చదువుతూ ఉండాలి. అలాగే ఇండియన్ ఆడిట్ మరియు అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు కూడా ఈ పోటీలో పాల్గొనడానికి అర్హులు కాదు.

ఒకరు ఒక వ్యాసం మాత్రమే రాయాలి. వారు ఒకటి కంటే ఎక్కువ పంపితే వారు ఈ పోటీలో పాల్గొనడానికి అర్హులు కాదు. అలాగే ఈ వ్యాసం 1500 పదాల కంటే ఎక్కువ ఉండకూడదు.

మీరు ఆంగ్లం లేదా హిందీలో వ్యాసాన్ని వ్రాయాలి. మీరు మీ వ్యాసాన్ని essay2023@cag.gov.in కి పంపవచ్చు. ఈ వ్యాసరచన పోటీ ఆగస్టు 20 వరకు జరగనుంది. కాబట్టి మీరు ఈ తేదీలోపు మీ వ్యాసాన్ని పంపాలి.

ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

మా వాట్సాప్ గ్రూప్ లో చేరడానికి Click Here 
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి Click Here