Pension : దివ్యాంగులకు గుడ్ న్యూస్..పెన్షన్ ను రూ.4,016 కు పెంచుతూ ఉత్తర్వులు జారీ

Pension : దివ్యాంగులకు గుడ్ న్యూస్..పెన్షన్ ను రూ.4,016 కు పెంచుతూ ఉత్తర్వులు జారీ 

దివ్యాంగులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.

దివ్యాంగులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. దివ్యాంగులకు ఇచ్చే ఆసరా పెన్షన్ ను భారీగా పెంచింది తెలంగాణ ప్రభుత్వం. దివ్యాంగులకు ఆసరా ఫించను రూ. 4,016కు పెంచుతూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన పెన్షన్ జులై నెల నుంచే అమలు చేయనున్నట్లు తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రంలో 5.20 లక్షల మందికి పైగా దివ్యాంగులు లబ్ది పొందనున్నారు.

ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

మా వాట్సాప్ గ్రూప్ లో చేరడానికి Click Here 
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి Click Here

దివ్యాంగులకు ప్రతి నెలా ఇచ్చే పింఛనను రూ.3.016 నుంచి రూ.4,016కు పెంచుతున్నట్లు ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది జూలై నుంచే అమల్లోకి వస్తుందని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మంచిర్యాల జిల్లాలో ప్రగతి నివేదన సభలో సీఎం ఈ ప్రకటన చేశారు. ఇక,రూ.1000 పెన్షన్ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల దివ్యాంగులు హర్షం వ్యక్తం చేశారు.

దివ్యాంగులకు పెన్షన్ ను రూ. 3,016 నుంచి రూ. 4,016 కు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ నెల నుంచే పెరిగిన పెన్షన్లను ఇవ్వన్నట్లు ప్రకటించింది. మంచిర్యాల సభలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చారని మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. పెంచిన పెన్షన్ ప్రకారం 5,11,656 మంది దివ్యాంగులకు రూ.4,016 చొప్పున నెలకు 205 కోట్ల 48 లక్షల 10 వేల 496 రూపాయలు అందనున్నాయి. సీఎం కేసీఆర్… పెన్షన్ పెంపు నిర్ణయంపై మంత్రి ఎర్రబెల్లి హర్షం వ్యక్తం చేశారు.

పెరిగిన పెన్షన్ దివ్యాంగులకు గౌరవప్రదమైన, భద్రతతో కూడిన జీవనం సాగిస్తారన్నారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో తెలంగాణలో దివ్యాంగులకు ఇతరులకు పెన్షన్లు అందుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి 2022 వరకు 28,81,222 కొత్త పెన్షన్లు మంజూరు చేశామన్నారు. గత 8 సంవత్సరాలలో మొత్తం రూ. 57,777.08 కోట్లు పెన్షన్ గా అందచేశామన్నారు.

పెన్షన్ల పెంపుపై తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. దేశంలో మునుపెన్నడూ లేనివిధంగా దివ్యాంగులకు రూ.4016కు పెన్షన్‌ పెంచినట్లు తెలిపారు. చారిత్రాత్మక నిర్ణయంతో 5లక్షల మందికిపైగా దివ్యాంగులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పెన్షన్ల పెంపు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని ఆయన ఓ ట్వీట్‌ లో తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

మా వాట్సాప్ గ్రూప్ లో చేరడానికి Click Here 
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి Click Here