Post Office Scheme: పోస్టాఫీస్ పథకం.. ఇలా చేస్తే.. ప్రతీ నెలా రూ.9250 పొందొచ్చు..

Post Office Scheme: పోస్టాఫీస్ పథకం.. ఇలా చేస్తే.. ప్రతీ నెలా రూ.9250 పొందొచ్చు..

సేవింగ్ పథకాలతో ఎక్కువ వడ్డీ అందించే ప్రభుత్వ రంగ సంస్థ పోస్టల్ డిపార్ట్ మెంట్. పోస్టాఫీస్ స్కీమ్‍ల్లో పెట్టుబడి పెడితే ఇన్వెస్ట్‌మెంట్ సురక్షితంగా ఉండటంతో పాటు వడ్డీ రూపంలో రాబడి వస్తుంది. బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్ చేసినా కానీ.. ఇక్కడ వచ్చే వడ్డీ దానిలో లభించదు. అందుకే చాలా మంది పోస్టాఫీస్ పథకాల్లో.. సేవింగ్ స్కీమ్ పై ఆసక్తి చూపిస్తుంటారు.

ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

మా వాట్సాప్ గ్రూప్ లో చేరడానికి Click Here 
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి Click Here

అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక సేవింగ్ పథకాన్ని తీసుకొచ్చింది. దాని పేరు పోస్టాఫీస్ మంత్లీ ఇన్ కమ్ స్కీమ్. ఈ ఖాతా ఓపెన్ చేసి పెట్టుబడి పెడితే ఇన్వెస్టర్ ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతీ నెలా రాబడి పొందవచ్చు

తాజాగా.. పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS) లో పెట్టుబడి పరిమితిని పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది . మంత్లీ స్కిమ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ కింద వ్యక్తిగతంగా లేదా జాయింట్ అకౌంట్ కూడా ఓపెన్ చేయవచ్చు.

10 ఏళ్లలోపు మైనర్ తరఫున గార్డియన్ ఈ ఖాతా తెరవచ్చు. 10 సంవత్సరాల వయసు దాటిన మైనర్లు వారి పేరుపైనే స్కీమ్‍లో ఇన్వెస్ట్ చేయవచ్చు. మీ దగ్గర్లో ఉన్న పోస్టాఫీసులో ఈ MIS ఖాతా తీసుకోవచ్చు.

అయితే ఈ స్కీమ్ లో జాయిన్ అవ్వాలంటే.. కనీసం రూ.1000 నుంచి గరిష్టంగా రూ.9లక్షల వరకు మంత్లీ ఇన్‍కమ్ స్కీమ్ కింద డిపాజిట్ చేయవచ్చు. మార్చి 31, 2023న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ పరిధిని పేర్కొన్నారు. ఒక వేళ జాయింట్ అకౌంట్ అయితే.. రూ.15 లక్షల వరకు జమ చేసుకోవచ్చు.

ఇలా డిపాజిట్ చేసిన మీ అమౌంట్ కు ప్రస్తుతం 7.4 శాతం వడ్డీ చొప్పున నెల నెల వడ్డీ డబ్బులను డ్రా చేసుకోవచ్చు. ఈ వడ్డీ రేటు అనేది ప్రతీ మూడు నెలలకు ఒక సారి మారుతుంటుంది. ప్రస్తుతం ఈ స్కీమ్ కింద రూ.1లక్ష ఇన్వెస్ట్ చేస్తే సుమారు రూ.610 వరకు రాబడి వస్తుంది.

ఒక వేళ మీరు రూ.9లక్షల డిపాజిట్ చేస్తే.. నెలకు రూ.5,550 పొందవచ్చు. ఇక రూ.15లక్షలకు అయితే.. రూ.9,250 బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుంది. ఖాతా మెచ్యూరిటీ ఐదు సంవత్సరాలుగా ఉంటుంది.

డిపాజిట్ చేసిన తేదీ తర్వాతి నెల నుంచి మెచ్యూరిటీ పూర్తయ్యే వరకు ప్రతీనెలా మీ పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాలో వడ్డీ రూపంలో రాబడి జమ అవుతుంది. డిపాజిట్ చేసిన సంవత్సరంలోగా ఖాతాను క్లోజ్ చేసే అవకాశం ఉండదు.

సంవత్సరం నుంచి మూడేళ్లలోగానే మంత్లీ ఇన్‍కమ్ స్కీమ్ అకౌంట్ ప్రీ-మెచ్యూర్ క్లోజ్ చేయాలంటే 2 శాతం డిడక్షన్ ఉంటుంది. మూడు సంవత్సరాల తర్వాత అయితే 1 శాతం ఉంటుంది. ఒకవేళ మెచ్యూరిటీ ముగియక ముందే డిపాజిట్ చేసిన వారు మరణిస్తే నామినీకి ఆ మొత్తం అందిస్తారు.

ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

మా వాట్సాప్ గ్రూప్ లో చేరడానికి Click Here 
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి Click Here