Scholarship 2023: ఈ నెలలో అప్లై చేసుకోవాల్సిన స్కాలర్‌షిప్స్ వివరాలివే..!

Scholarship: వివిధ సంస్థలు విద్యార్థుల కోసం స్కాలర్‌షిప్స్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేశాయి. జులై నెలలో అప్లై చేసుకోవడానికి అందుబాటులో ఉన్న స్కాలర్‌షిప్స్ ఏవో పరిశీలిద్దాం.

విద్యార్థులు, ప్రొఫెషనల్స్ తమ లక్ష్యాలను సాధించడంలో స్కాలర్‌షిప్స్, ఫెలోషిప్స్ పాత్ర కీలకం. ఇవి ఫీజుల భారాన్ని తగ్గించి, ఆర్థికంగా సపోర్ట్ ఇస్తాయి. హై-క్వాలిటీ ఎడ్యుకేషన్, రీసెర్చ్‌, రియల్ వరల్డ్ ఎక్స్‌పీరియన్స్ కోసం స్కాలర్‌షిప్స్ ఉపయోగపడతాయి. తాజాగా వివిధ సంస్థలు విద్యార్థుల కోసం స్కాలర్‌షిప్స్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేశాయి. జులై నెలలో అప్లై చేసుకోవడానికి అందుబాటులో ఉన్న స్కాలర్‌షిప్స్ ఏవో పరిశీలిద్దాం.

ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

మా వాట్సాప్ గ్రూప్ లో చేరడానికి Click Here 
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి Click Here

Scholarship 2023

* రామన్‌కాంత్ ముంజాల్ స్కాలర్‌షిప్-2023

హీరో ఫిన్‌కార్ప్ సపోర్ట్‌తో రామన్‌కాంత్ ముంజాల్ ఫౌండేషన్ ఈ స్కాలర్‌షిప్స్‌ ఆఫర్ చేస్తోంది. టాప్ కాలేజీల్లో ఫైనాన్స్ కోర్సులు చదివే అభ్యర్థులకు ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వడం ఈ ఫెలోషిప్ ముఖ్య ఉద్దేశం. బీబీఏ, బీఎఫ్‌ఐఏ, బీకామ్(H,E), బీఎంఎస్, ఐపీఎం, బీఏ(ఎకనామిక్స్), బీబీఎస్, బీబీఐ, బీఏఎఫ్, బీఎస్సీ(స్టాటిస్టిక్స్)తో పాటు ఇతర ఫైనాన్స్ డిగ్రీ కోర్సుల్లో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు.

అలాగే స్టూడెంట్స్ ఇంటర్, పదో తరగతి పరీక్షల్లో కనీసం 80 శాతం స్కోర్ సాధించి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.4 లక్షల్లోపు ఉండాలి. ఈ అర్హతలు ఉన్నవారు సెప్టెంబర్ 15 లోపు www.b4s.in/it/RMKSP1 లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికయ్యే అభ్యర్థులకు మూడేళ్ల పాటు సంవత్సరానికి రూ.5 లక్షల వరకు స్కాలర్‌షిప్ వస్తుంది.

* కోటక్ జూనియర్ స్కాలర్‌షిప్- 2023

కోటక్ మహీంద్రా గ్రూప్ కంపెనీలకు చెందిన కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఈ స్కాలర్‌షిప్‌ అందిస్తోంది. ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలోని జూనియర్ కాలేజీల్లో 11వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు 2023 పదో తరగతి పరీక్షల్లో(SSC/CBSE/ICSE) 85% పైగా మార్కులు సాధించి ఉండాలి. వారి కుటుంబ వార్షిక ఆదాయం రూ.3,20,000లోపు ఉండాలి.

2023-24 అకడమిక్ ఇయర్ కోసం ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లోని జూనియర్ కాలేజీల్లో ఆర్ట్స్, కామర్స్, సైన్స్ స్ట్రీమ్‌ల్లో 11 తరగతి కోసం తప్పనిసరిగా అడ్మిషన్ పొంది ఉండాలి. ఈ అర్హతలు ఉన్నవారు www.b4s.in/it/KJSP1 సైట్‌లో జులై 31లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన వారికి నెలకు రూ.3000 స్కాలర్‌షిప్ అందుతుంది.

Read More: గ్రామ పంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

* ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఎంబీఏ స్కాలర్‌షిప్ 2023- 25

వార్షిక ఆదాయం రూ.6 లక్షల కంటే తక్కువగా ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఐడీఎఫ్‌సీ బ్యాంక్ ఎంబీఏ స్కాలర్‌షిప్స్‌ ఆఫర్ చేస్తోంది. బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో పీజీ చేయడానికి విద్యార్థులను ప్రోత్సహించడమే ఈ స్కాలర్‌షిప్ లక్ష్యం. 2023 అకడమిక్ ఇయర్‌కు రెండేళ్ల ఫుల్‌టైమ్ ఎంబీఏ ప్రోగ్రామ్ కోసం ఫస్ట్ ఇయర్‌లో ఎన్‌రోల్ అయిన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ కోసం అప్లై చేసుకోవచ్చు.

దరఖాస్తుదారుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.6లక్షల లోపు ఉండాలి. అభ్యర్థుల వయసు 35 ఏళ్లకు మించకూడదు. తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే మొబైల్ నంబర్‌ను ఆధార్ కార్డ్‌కి లింక్ చేసి ఉండాలి. ఈ అర్హతలు ఉన్న అభ్యర్థులు www.b4s.in/it/IFBMS4 వెబ్‌సైట్‌లో జులై 31 లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికయ్యే అభ్యర్థులకు సంవత్సరానికి రూ.లక్ష చొప్పున రెండేళ్ల పాటు స్కాలర్‌షిప్ అందుతుంది.

Read More: గ్రామ పంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

మా వాట్సాప్ గ్రూప్ లో చేరడానికి Click Here 
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి Click Here

Leave a comment