SSC Recruitment: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మరో జాబ్ నోటిఫికేషన్

SSC Recruitment: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మరో జాబ్ నోటిఫికేషన్

SSC Recruitment: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC).. తాజాగా కీలక ప్రకటన చేసింది. 2023 సంవత్సరానికి సంబంధించి మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ పరీక్ష నోటిఫికేషన్‌ను జూన్ 30న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది.

నిరుద్యోగులకు ఒక గుడ్‌న్యూస్. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ డిపార్ట్‌మెంట్లలో ఉద్యోగ నియామకాలు చేపట్లే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC).. తాజాగా కీలక ప్రకటన చేసింది. 2023 సంవత్సరానికి సంబంధించి మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ పరీక్ష నోటిఫికేషన్‌ను జూన్ 30న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది. ‘మల్టీ-టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్, హవల్దార్ (CBIC & CBN) పరీక్ష- 2023 నోటిఫికేషన్ జూన్ 14న విడుదల కావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల రీషెడ్యూల్ చేశాం. జూన్ 30న పూర్తి షెడ్యూల్ ప్రకటిస్తాం.’ అని SSC లేటెస్ట్ నోటిఫికేషన్‌లో వివరణ ఇచ్చింది.

మేము అందించే మొత్తం సమాచారం మీకు నచ్చితే, ప్రతిరోజూ కొత్త ఉద్యోగ సమాచారం కోసం మా వాట్సాప్ గ్రూప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి. మేము ప్రతిరోజూ ఉద్యోగ సమాచారాన్ని మీకు నేరుగా పోస్ట్ చేస్తాము. దయచేసి మేము అందించిన ఉద్యోగ సమాచారం యొక్క చివరి భాగంలో దరఖాస్తు చివరి తేదీ మరియు ప్రారంభ తేదీని స్పష్టంగా చదివి, ఆపై దరఖాస్తు చేయండి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

మా వాట్సాప్ గ్రూప్ లో చేరడానికి Click Here 
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి Click Here

ప్రత్యేక నోటీసు :- ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది సువర్ణావకాశం. ఈ విధంగా, ఆసక్తి గల అభ్యర్థులు ఉద్యోగ బడి వెబ్‌సైట్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు అంటే కర్ణాటక ఉద్యోగాల నవీకరణ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు, ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు & పార్ట్ టైమ్/ఫుల్ టైమ్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

మీ దృష్టికి :- మేము అందించిన అన్ని ఉద్యోగ సమాచారం పూర్తిగా ఉచితం మరియు ఏ అభ్యర్థుల నుండి డబ్బు తీసుకోబడదు. ఎవరైనా ఉద్యోగ బడి పేరుతో డబ్బులు అడిగితే వెంటనే మా ఈమెయిల్ అడ్రస్ కు మెసేజ్ చేసి మా దృష్టికి తీసుకురావాలి.

SSC Recruitment పూర్తి ఉద్యోగ వివరాలు

రెండు దశల్లో పరీక్షలు

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పొజిషన్స్ కోసం నిర్వహించే SSC MTS 2023 పరీక్ష రెండు దశల్లో ఉంటుంది. మొదటిది SSC MTS టైర్-1 ఎగ్జామ్ కాగా, రెండోది SSC MTS టైర్-2 ఎగ్జామ్. SSC MTS హవల్దార్‌ కోసం టైర్-1 పరీక్ష తర్వాత ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటాయి. అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక పోర్టల్ ssc.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

15 భాషల్లో ఎగ్జామ్

ఈ ఏడాది నుంచి SSC MTS పరీక్షను 15 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నారు. హిందీ, ఇంగ్లీష్, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, లారవలన్, మణియూరి (మైతేయి లేదా మెయిథీ), మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ వంటి భాషల్లో ఎగ్జామ్ ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో భాషను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

సీబీటీ మోడ్‌లో పరీక్షలు

SSC MTS టైర్ 1 పరీక్ష సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో జరిగే అవకాశం ఉంది. టైర్ -2 పరీక్ష షెడ్యూల్‌పై త్వరలో స్పష్టత రానుంది. SSC MTS, హవల్దార్ పరీక్షకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం అభ్యర్థులు అధికారిక పోర్టల్‌ను తరచూ చెక్ చేస్తుండాలి. ఈ పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మోడ్‌‌లో జరగనున్నాయి. జనరల్ ఇంగ్లీష్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ అండ్ న్యూమరికల్ ఆప్టిట్యూడ్ అనే నాలుగు విభాగాల నుంచి ఎగ్జామ్‌లో ప్రశ్నలు ఉంటాయి.

అర్హత ప్రమాణాలు

ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్ హవల్దార్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి పదో తరగతి పాసై ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

మా లక్ష్యం :- ప్రతి అభ్యర్థికి తాజా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారాన్ని పొందే హక్కు ఉందని మేము విశ్వసిస్తున్నాము, కాబట్టి మేము ఈ ఉద్యోగ నోటిఫికేషన్‌ను భాగస్వామ్యం చేస్తున్నాము. మీరు ప్రభుత్వ ఉద్యోగాలు లేదా తాజా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం చూస్తున్నట్లయితే, మీరు మా ముందస్తు ఉద్యోగ శోధనను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు

Leave a comment