తెలంగాణ గురుకుల రిక్రూట్‌మెంట్: Telangana Gurukul Recruitment 2023

తెలంగాణ గురుకుల రిక్రూట్‌మెంట్: తెలంగాణలోని గురుకులాల్లో బోధనా సిబ్బంది, ఇతర ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు సంబంధించిన గురుకుల విద్యాలయాల సంస్థ కీలక ప్రకటన వెలువరించింది. ఈ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్ష తేదీలను ఖరారు చేసింది. ఆగస్టు 1 నుంచి 23 తేదీ వరకు గురుకుల నియామక పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

తెలంగాణ గురుకుల రిక్రూట్‌మెంట్పో – స్టుల కోసం అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఖాళీగా ఉన్న పోస్టులను శాఖ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

తెలంగాణ గురుకుల రిక్రూట్‌మెంట్: – అభ్యర్థులు ఈ పోస్ట్‌ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు నమోదు చేసుకోవాలి, ఆపై వారు లాగిన్ చేసి వారి వివరాలను నమోదు చేయవచ్చు. ఉద్యోగ బడి యొక్క ఈ కథనంలో ఈ ఉద్యోగం గురించి పూర్తి సమాచారం క్రింద ఉంది.

తెలంగాణ గురుకుల రిక్రూట్‌మెంట్

ఈ పరీక్షలన్నింటినీ ఆన్‌లైన్‌లోనే జరుగుతాయని తెలిపారు. 9వేలకుపైగా పోస్టులకు గానూ గురుకుల నియామక బోర్డు 9 నోటిఫికేషన్లను విడివిడిగా విడుదల చేయగా.. 2.63 లక్షల మందికిపైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే, ఈ పరీక్షల షెడ్యూల్‌ను ఒకట్రెండు రోజుల్లో వెల్లడించనున్నట్లు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్(TREIRB) కన్వీనర్ డాక్టర్ మల్లయ్య బట్టు తెలిపారు.

పోస్టుల వివరాలను గమనించినట్లయితే..

  • డిగ్రీ లెక్చరర్ పీడీ, లైబ్రేరియన్: 868
  • జూనియర్ లెక్చరర్, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్: 2008
  • పోస్ట్ గ్రాడ్యూయేట్ టీచర్లు(పీజీటీ): 1276
  • ట్రైన్డ్ గ్రాడ్యూయేట్ టీచర్లు(టీజీటీ): 4020
  • లైబ్రేరియన్ స్కూల్: 434
  • ఫిజికల్ డైరెక్టర్స్ ఇన్ స్కూల్: 275
  • డ్రాయింగ్ టీచర్లు, ఆర్ట్ టీచర్లు: 134
  • క్రాఫ్ట్ ఇన్ స్ట్రక్టర్, క్రాఫ్ట్ టీచర్లు: 92
  • మ్యూజిక్ టీచర్లు: 124

Leave a comment