TS Gurukul Recruitment 2023 | గురుకులాల్లో 9210 టీచర్‌ పోస్టులు.. ఆగస్టు 1 నుంచి పరీక్షలు

TS Gurukul Recruitment 2023: గురుకులాల్లో 9210 టీచర్‌ పోస్టులు.. ఆగస్టు 1 నుంచి పరీక్షలు.. TREIRB వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు పూర్తి వివరాలు

TS Gurukul Recruitment 2023 : పోస్టుల కేటగిరీ, సబ్జెక్టుల వారీగా ఏరోజు ఏ పరీక్ష నిర్వహించనున్నారు.. తదితర వివరాలతో రెండు రోజుల్లో సమగ్ర షెడ్యూలు విడుదల చేస్తామని బోర్డు అధికారులు పేర్కొన్నారు.

TS Gurukul Recruitment 2023

TREIRB TS Gurukulam Jobs Exam Dates : తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో (Gurukulam) 9,210 Teacher పోస్టుల భర్తీకి రాతపరీక్ష తేదీలు ఖరారయ్యాయి. ఆగస్టు 1 నుంచి 23 వరకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు (CBRD) నిర్వహించాలని గురుకుల నియామక బోర్డు (TREIRB) నిర్ణయించింది. పోస్టుల కేటగిరీ, సబ్జెక్టుల వారీగా ఏరోజు ఏ పరీక్ష నిర్వహించనున్నారు.. తదితర వివరాలతో రెండు రోజుల్లో సమగ్ర షెడ్యూలు విడుదల చేస్తామని బోర్డు అధికారులు పేర్కొన్నారు.

Read More: AFCAT-2 2023: ఎయిర్ ఫోర్స్‌లో రిక్రూట్‌మెంట్; 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి

Read More: IOCL Recruitment 2023 | విద్యార్హత 10వ, ITI, డిప్లొమా లేదా తత్సమానం ఉత్తీర్ణ చాలు

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ గురుకుల సొసైటీలు, సాధారణ గురుకుల సొసైటీల పరిధిలో 9,210 పోస్టుల భర్తీకి ఏప్రిల్‌ 5న గురుకుల నియామక బోర్డు (TREIRB) నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించి ఏప్రిల్‌ 14 నుంచి మే 27 వరకు ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరించింది. డిగ్రీ, జూనియర్‌ లెక్చరర్లు, పీజీటీ, టీజీటీ, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్‌ టీచర్లు, లైబ్రేరియన్లు, ఫిజికల్‌ డైరెక్టర్ల పోస్టులన్నింటికీ కలిపి 2,63,045 దరఖాస్తులు వచ్చాయి.

అభ్యర్థులు పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు https://treirb.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ఈ విద్యాసంవత్సరంలోనే రిక్రూట్‌మెంట్‌ పూర్తి:

ఈ పరీక్షలకు ఇతర నియామక పరీక్షల తేదీలతో ఇబ్బందులు లేకుండా గురుకుల బోర్డు జాగ్రత్తలు తీసుకుంది. టీఎస్‌పీఎస్సీ, పోలీసు నియామక మండలి, వైద్య నియామక మండలి అధికారులను సంప్రదించిన తరువాత ఆగస్టు 1 నుంచి 23 వరకు తేదీలను ఖరారు చేసింది. ఆయా తేదీల్లో సీబీఆర్‌టీ విధానంలో పరీక్షలు నిర్వహించేందుకు స్లాట్‌ బుక్‌ చేసుకుంది. కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలకు అవసరమైన మౌలిక సదుపాయాలున్న అన్ని జిల్లాల్లో ఈ పరీక్షలు నిర్వహించనుంది.

అక్టోబరు నాటికి ఫలితాలు వెల్లడించి.. ఈ విద్యాసంవత్సరంలోనే నియామకాలు పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇక.. గురుకుల నియామకాల కోసం ఓఎంఆర్‌ పద్ధతిలో రాతపరీక్షలు నిర్వహించాలని తొలుత బోర్డు భావించింది. అయితే వేగంగా పరీక్షలు నిర్వహించి.. త్వరగా ఫలితాలు వెల్లడించేందుకు సీబీఆర్‌టీ విధానమే మేలని తాజాగా నిర్ణయించింది.

గమనిక: మేము మా వెబ్‌సైట్‌లో జాబితా చేసిన ఏదైనా ఉద్యోగాలకు దరఖాస్తు / షార్ట్‌లిస్ట్ చేయడానికి జీతం పొందడానికి భారత ప్రభుత్వ ఉద్యోగాలు ఏ అభ్యర్థిని పిలవవు/ అడగవు, దయచేసి IOCL ఉద్యోగాల కోసం ఎవరికీ ఎటువంటి మొత్తాన్ని చెల్లించవద్దు. ”

మా లక్ష్యం:  తాజా ప్రభుత్వ ఉద్యోగాల హెచ్చరికను పొందడానికి ప్రతి అభ్యర్థులకు హక్కులు ఉన్నాయని మేము విశ్వసిస్తున్నాము, కాబట్టి మేము IOCL ఉద్యోగ నోటిఫికేషన్‌ను భాగస్వామ్యం చేస్తున్నాము. మీరు ప్రభుత్వ ఉద్యోగాలు లేదా తాజా సర్కారీ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం చూస్తున్నట్లయితే, మీరు మా ముందస్తు ఉద్యోగ శోధనను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు

Leave a comment